: 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో విద్యా బాలన్


హీరో నాగార్జున హోస్టుగా వ్యవహరిస్తున్న క్విజ్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు'లో బాలీవుడ్ అందాల భామ విద్యా బాలన్ పాల్గొంది. తను నటించిన తాజా హిందీ చిత్రం 'బాబీ జాసూస్' ప్రమోషన్ కోసం కొన్ని రోజుల కిందట ఆమె హైదరాబాదు వచ్చారు. అప్పుడే ఈ షోలో పాల్గొన్న విద్య తన సినిమాను కూడా ప్రమోట్ చేసింది. దానికి సంబంధించిన ఎపిసోడ్ త్వరలో మాటీవీలో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని సదరు ఛానల్ ప్రొడక్షన్ టీమ్ ట్విట్టర్ లో వెల్లడించింది. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' లో విద్యా బాలన్ పాల్గొన్న ఎపిసోడ్ త్వరలో మీ మాటీవీలో చూడండి' అంటూ పోస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News