: ఆలోచన ఓపెన్‌ అయితేనే.. కంప్యూటర్‌ బూట్‌ అవుతుంది


కంప్యూటర్‌ ఆన్‌ చేయడానికి పాస్‌వర్డ్‌ పెట్టుకుంటే.. దాన్ని ఇంట్లో పిల్లలు తెలుసుకుని వాడేస్తున్నారని బాధగా ఉందా? లేదా, పాస్‌వర్డ్‌ హాకర్స్‌ తో బెడద అని భయపడుతున్నారా? అయితే మీకిది శుభవార్త. పాస్‌వర్డ్‌ అనేది ఒక పదంలాగా కాకుండా ఆలోచనల్లాగా ఉండే పద్ధతిని నిపుణులు రూపొందించారు. ఓ ప్రత్యేకమైన హెడ్‌సెట్‌ను బ్లూటూత్‌ ద్వారా కంప్యూటరుకు అనుసంధానిస్తే.. దాని బయోసెన్సార్‌ పరిజ్ఞానంతో బ్రెయిన్‌ వేవ్స్‌ను అధ్యయనం చేసి అది మెదడులో ఆలోచనల్ని గుర్తిస్తుంది. ఆ ఆలోచనలే పాస్‌వర్డ్‌గా సిస్టం బూట్‌ అవుతుంది. ఇది ఇతరులకు తెలిసే వీలుండదు. సాధ్యం కూడా కాదు. మాషబుల్‌ వెబ్‌సైట్‌ ప్రకటించిన వివరాల ప్రకారం.. కాలిఫోర్నియా యూనివర్సిటీ.. బెర్కెలీ స్కూల్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ వారు దీన్ని రూపొందించారు.

  • Loading...

More Telugu News