: రెంటచింతలలో 44, విశాఖ, మచిలీపట్నంలో 42 డిగ్రీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రెంటచింతలలో అత్యధికంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విశాఖ, కాకినాడ, మచిలీపట్నం, ఒంగోలులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డు అయింది. ఎండల తీవ్రతకు తోడు వడగాల్పులతో ప్రజలు అల్లాడుతున్నారు. సముద్ర తీరప్రాంత ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సాధారణం కన్నా కోస్తాలో 8, రాయలసీమలో 5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.