: రేపు ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం రాజయ్య పర్యటన


తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజయ్య రేపు (గురువారం) ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్ మీడియాకు వెల్లడించారు. గురువారం ఉదయం 8.30 గంటలకు ఖమ్మం జిల్లా బయ్యారంలో రాజయ్య పర్యటన ప్రారంభమవుతుందని, 9 గంటలకు ఇల్లెందులో ఆయనకు సన్మానం చేయనున్నామని రాజేందర్ చెప్పారు. అనంతరం భద్రాచలంలోని సీతారాముల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఆ తర్వాత ఐటీడీఏ కార్యాలయంలో జిల్లా అధికారులతో వైద్య శాఖపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News