: పార్టీలు మారేది నేతలే!: సీతక్క
అధికారం కోసం పార్టీలు మారేది కేవలం నేతలేనని తెలంగాణ టీడీపీ నేత సీతక్క అన్నారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి... కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని వీడిన వారికి కార్యకర్తలే బుద్ధి చెబుతారని తెలిపారు. ఒకరిద్దరు పార్టీ మారినంత మాత్రాన కేడర్ నిరుత్సాహపడదని ఆమె వ్యాఖ్యానించారు. టీడీపీకి కార్యకర్తలే బలమని చెప్పిన ఆమె, తాజా పరిణామాలతో ఆందోళన చెదాల్సిన పని లేదని అన్నారు. టీడీపీ కార్యకర్తలను ఏకతాటిపై నడిపి మళ్లీ పుంజుకుంటామని ఆమె తెలిపారు.