: చాటుగా ఉంటేనే బాసుల్ని గెలవొచ్చు


ఆఫీసుల్లో బాసుతో నేరుగా వెళ్లి డిస్కషన్‌లో కూర్చుంటే.. ఎంత చర్చ చేసినా ఆయనే నెగ్గుతున్నాడు తప్ప.. మన ఆలోచనకు విలువ లేదని బాధపడుతున్నారా? వన్‌ 'టూ'వన్‌ కూర్చోకుండా.. మధ్యవర్తి ద్వారాగానీ, ఫోన్లోగానీ మీ ఆలోచనను షేర్‌ చేసుకుని చూడండి. రిజల్టు మీరు అనుకున్నట్లు వస్తుంది. ప్రత్యక్షంగా ముఖాముఖి కంటె, బాసుల్తో పనులు చక్కబెట్టుకోడానికి చాటుగా ఉండి వ్యవహారం నడిపితేనే మంచిదని ఓ తాజా అధ్యయనం చెబుతోంది. లండన్‌ శాస్త్రవేత్త మైకేల్‌ టేలర్‌ ఈ పరిశోధన నిర్వహించారు. ముఖాముఖి చర్చల్లో ఎక్కువగా అధికారులే పంతం నెగ్గించుకుంటారు. అదే చాటుగా ఉండి లేదా మధ్యవర్తుల ద్వారా జరిపే చర్చల్లో ఉద్యోగులదే పైచేయి అయింది. ఓ సైకాలజీ సమావేశంలో టేలర్‌ ఈ వివరాలు వెల్లడించారు. కాబట్టి మిత్రులారా... బాసుల్ని జీతం పెంచమని అడిగే సందర్భాల్లో నేరుగా వెళ్లి అడిగి భంగపడ్డం కంటె.. ఫోనులోనో, ఇతరుల ద్వారానో అడిగించడం మంచిది.

  • Loading...

More Telugu News