: మావోలకు విజ్ఞప్తి... రేపిస్టులకు హెచ్చరిక: ఏపీ హోం మంత్రి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం కనుక మావోయిస్టులు కార్యకలాపాలు తగ్గించుకోవాలని ఆ రాష్ట్ర హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప మావోయిస్టులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, అత్యాచారాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహించదని అన్నారు. అత్యాచారాల నియంత్రణకు టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి, మహిళలపై దాడులకు నిర్భయ చట్టాన్ని ప్రయోగిస్తామని అన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారి పర్యవేక్షణలో స్పెషల్ సెల్ ను ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. మావోలు అభివృద్ధికి ఆటంకం కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News