: కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నెల 27 లేదా 28వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ టూర్ లో ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టు, పీపీఏలు, జలవివాదంపై ఆయన కేంద్రంతో చర్చలు జరిపే అవకాశం ఉంది. అలాగే కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులపై కూడా కేసీఆర్ చర్చించనున్నారు.