: రెండు మెదడుల అనుసంధానం సాధ్యమేనా?
అలాంటి ఆశను రేకెత్తించే ప్రయోగం ఇది. భవిష్యత్తులో రెండు మానవ మెదడులను అనుసంధానించి.. ఒక మెదడులో పుట్టే ఆలోచనలకు రెండో మెదడు స్పందించి.. అది పనిచేసేలా ఉండే ఏర్పాటుకు ఈ ప్రయోగం ఒక బీజం. అలాంటి కృషికి ఒక మెట్టు లాగా మనిషిమెదడు, ఎలుక మెదడును హార్వర్డ్ శాస్త్రవేత్తలు అనుసంధానించారు. మనిషి మెదడు ఆలోచనల ద్వారా ఎలుకను మెదడును ప్రేరేపించి అది తోకను కదిలించేలా చేశారు. పైగా కోయకుండా, కుట్లు లేకుండా ఈ ప్రయోగంలో మెదళ్లను అనుసంధానించడం విశేషం.
ఈ ఏడాది మొదట శాస్త్రవేత్తలు రెండు ఎలుకల మెదళ్లను అనుసంధానించారు. తాజాగా ఒక మనిషి, మరో ఎలుక మెదళ్లను ప్రయోగించారు. మనిషి పుర్రెపై ఎలక్ట్రోడ్‌లు పెట్టి.. ఎలుకకు మత్తుమందు ఇచ్చారు. అల్ట్రాసౌండ్ తరంగాల ద్వారా మనిషి ఆలోచనలు ఎలుకలోకి వెళ్లేలా చేశారు. మనిషి ఆలోచనలో మత్తుగా పడిన ఎలుక మెదడు పనిచేసి.. తోకను ఊపడంతో.. ప్రయోగం సఫలవంతమైనట్లుగా నిర్ణయించుకున్నారు.