: ఎక్సైజ్ సుంకం రాయితీ ఆరు నెలల పాటు పొడిగింపు
ఆటోమోబైల్స్, క్యాపిటల్ గూడ్స్, వినియోగదారుల వస్తువులపై ఉన్న ఎక్సైజ్ సుంకం రాయితీని కేంద్రం ప్రభుత్వం మరో ఆరు నెలల పాటు పొడిగించింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ రాయితీ అమల్లో ఉంటుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. దీనిపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, సుంకం రాయితీ వల్ల స్వల్పకాలంలో ఆదాయం తగ్గుతుందని తెలిపారు. దీర్ఘకాలంలో మాత్రం ఈ రాయితీ ఆర్ధికవృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.