: 'కాంగ్రెస్' అధ్యాయం ముగిసింది: కేసీఆర్
కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వదని స్సష్టమైందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ఆ అధ్యాయం ముగిసిందని ఆయన చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్యోగ సంఘాలు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెహ్రూ, ఇందిర తెలంగాణను నిండా ముంచారని గుర్తుచేశారు. కాగా, తెలంగాణ ఉద్యోగుల పట్ల వేధింపులు ఎక్కువవుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వేధింపులకు అడ్డుకట్ట వేసే విషయమై రెండు మూడు రోజుల్లో ప్రణాళిక సిద్ధం చేస్తామని కేసీఆర్ చెప్పారు. ఇక ఎన్నికల అనంతరం తెలంగాణ రావడం తథ్యమని ఆయన ఉద్యోగుల్లో ఉత్సాహం కలిగించే ప్రయత్నం చేశారు.