: చరిత్రను తిరగరాస్తా: మంత్రి మాణిక్యాలరావు
దేవాదాయశాఖ మంత్రిగా పని చేస్తే భవిష్యత్ ఉండదన్న రాజకీయ నమ్మకాన్ని తిరగరాస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, దేవాదాయ శాఖ మంత్రిగా దేవుడికి, భక్తులకు సేవ చేసే భాగ్యం కలిగిందని అభిప్రాయపడ్డారు. 25 వేల ఎకరాల దేవాదాయ భూములు అన్యాక్రాంతమయ్యాయని తెలిపిన ఆయన, వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెప్పారు.