: ఐటీ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తాం: కేటీఆర్
ఐటీ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలపటమే తమ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సచివాలయంలో ఆయన ఇవాళ ఒరాకిల్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రేషన్ కార్డులు, ఫించన్లు నిజమైన లబ్ధిదారులకు చేరేలా ఐటీ పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని ఆయన అన్నారు. ఐటీ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామని, ఈ-పంచాయతీ, ఈ-ఎడ్యుకేషన్, ఈ-హెల్త్ వ్యవస్థలను అందుబాటులోకి తీసుకువస్తామనీ అన్నారు. ఈ నెల 27వ తేదీన 150 ఐటీ కంపెనీలతో సమావేశం నిర్వహించనున్నట్లు కేటీఆర్ తెలిపారు.