: ఫోటో జర్నలిస్టులను తప్పించుకోబోయి కారును ఢీ కొట్టిన సెలబ్రిటీ
ఫోటో జర్నలిస్టులను తప్పించుకునే ప్రయత్నంలో హాలీవుడ్ సెలబ్రిటీ ఓ కారును ఢీ కొట్టాడు. లాస్ ఎంజెలిస్ లో స్టేజ్ షో ఉండడంతో, ప్రాక్టీస్ కోసం అక్కడ ఉంటున్న యువపాప్ సంచలనం జస్టిన్ బీబర్ బెవెర్లీ హిల్స్ లోని బౌచోన్ రెస్టారెంట్ కు వెళ్లాడు. అక్కడ అతనిని ఫోటో జర్నలిస్టులు వెంటాడారు. వారి బారినుంచి తప్పించుకోవాలనే తొందరలో బీబర్ డ్రైవర్ కారును వేగంగా వెనక్కి తిప్పాడు. ఈ క్రమంలో వెనుకనున్న బీఎండబ్ల్యూ కారును ఢీ కొట్టాడు. ఈ సమయంలో బీబర్ వెనుక సీట్లో కూర్చొన్నాడు. కాగా, దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.