: పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలంటూ బంద్


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పోలవరం ముంపు మండలాల విలీనంపై తీర్మానాన్ని ఆమోదించడాన్ని నిరసిస్తూ టీజేఏసీ బంద్ కు పిలుపునిచ్చింది. ముంపు ప్రాంతాలను తెలంగాణలోనే ఉంచాలంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు. భద్రాచలం డివిజన్ లోని నాలుగు మండలాలు, పాల్వంచ డివిజన్ లోని మూడు మండలాల్లో బంద్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా భద్రాచలం బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. పెట్రోల్ బంకులు, పాఠశాలలు, దుకాణాలు మూతబడ్డాయి.

  • Loading...

More Telugu News