: కేటీఆర్ తో భేటీ అయిన ఒరాకిల్ సంస్థ ప్రతినిధులు
తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ తో ప్రముఖ ఐటీ కంపెనీ ఒరాకిల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. సచివాలయంలో జరుగుతున్న ఈ సమావేశంలో... హైదరాబాదులో పెట్టుబడులు, మౌలిక వసతులపై వారు చర్చిస్తున్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు హైదరాబాదులో ప్రారంభం కానున్న నేపథ్యంలో, ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.