: మంత్రి నారాయణపై కేసు నమోదు చేయండి: కోర్టు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణపై కేసు నమోదు చేయాలని విజయవాడ కోర్టు పోలీసులను ఆదేశించింది. కేసు పూర్వాపరాలు... విజయవాడ మొగల్రాజపురంలోని నారాయణ ఒలింపియాడ్ స్కూల్ లో విశాఖపట్టణానికి చెందిన ఐతా రామలింగేశ్వరరావు (సెంట్రల్ ఎక్సైజ్ సూపరిండెంట్) తన కుమారుడు రామసాయి అనుదీప్ ను 2010 జూన్ లో 8వ తరగతిలో జాయిన్ చేశారు. తొమ్మిదో తరగతి ఫీజు చెల్లించేందుకు అతని భార్య స్కూలుకి వెళ్లగా 90 వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు.
'గతంలో 85 వేల రూపాయలని మాట్లాడుకున్నాం కదా? ఇప్పుడు పెంచడమేంట'ని ఆమె స్కూలు యాజమాన్యాన్ని ప్రశ్నించారు. ఆమె అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, అవమానకరంగా ప్రిన్సిపల్ ప్రవర్తించారు. దీంతో బాధితురాలి భర్త ప్రైవేటు ఫిర్యాదు చేయడంతో స్కూలు ప్రిన్సిపల్ సూరయ్య, కరెస్పాండెంట్ మంత్రి నారాయణపై చీటింగ్, నమ్మకద్రోహం సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.