: ఎంఎంటీఎస్ మంత్లీ పాస్ రూ.148 మాత్రమే!
రైల్వే ఛార్జీలను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో సామాన్యులతో పాటు అన్ని వర్గాల నుంచి నిరసన వెల్లువెత్తింది. దాంతో రైల్వే ఛార్జీల్లో సీజన్ పాస్ తీసుకునే వారికి, సబర్బన్ రైళ్లలో ప్రయాణించే వారికి (80 కి.మీ. వరకు) కొంత మినహాయింపును ఇచ్చారు. దీంతో ప్రస్తుతం హైదరాబాదు ఎంఎంటీఎస్ నెలవారీ పాస్ రూ.130 రూపాయలుండగా... తాజాగా పెంచిన ధరలతో రూ. 148 చేరింది. హైదరాబాదులో సిటీ బస్సు ప్రయాణంతో పోలిస్తే ఎంఎంటీఎస్ ఛార్జీలు తక్కువగా ఉన్నాయన్న సంగతి తెలిసిందే.