: కర్నూలు జిల్లాలో ఇసుక మాఫియా ఘాతుకం
కర్నూలు జిల్లాలో ఇసుక మాఫియా తీవ్ర ఘాతుకానికి పాల్పడింది. ఓర్వకల్లు మండలం నన్నూరు సమీపంలోని నిట్ లో స్థలాన్ని పరిశీలిస్తుండగా రెవెన్యూ సిబ్బందిపై ఇసుక లారీ ఒక్కసారిగా దూసుకెళ్లింది. దాంతో, అక్కడిక్కడే ముగ్గురు గ్రామ సేవకులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఓర్వకల్లు తహశీల్దారు సునితాబాయి, ఆర్ఐ శ్రీనివాసులును కర్నూలు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆర్ ఐ కూడా చనిపోయాడు.