: నెల్లూరు జిల్లాలో రైతుల రాస్తారోకో
విద్యుత్ కోతలకు నిరసనగా రైతులు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం చిల్లకూరు వద్ద ఈ రోజు రైతులు రాస్తారోకో చేపట్టారు. విద్యుత్ కోతలతో తామెంతో నష్టపోతున్నామని వారు చెబుతున్నారు. కోతలకు సంబంధించి ఆ శాఖ అధికారుల నుంచి సరైన సమాచారం కూడా అందడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ క్రమంలో పూతలపట్టు-నాయుడుపేట రహదారిపై వారు బైఠాయించారు. భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో... పోలీసులు రంగప్రవేశం చేసి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.