: నేడు సుష్మాస్వరాజ్ బంగ్లాదేశ్ పర్యటన


విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక సుష్మాస్వరాజ్ తొలిసారి ఒంటరిగా బంగ్లాదేశ్ అధికారిక పర్యటనకు వెళుతున్నారు. ఆ దేశ ప్రధాన నేతలు, అధికారులతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సమస్యలు, సరిహద్దు ఒప్పందం, తీస్తా నది ఒప్పదంపై ప్రధానంగా చర్చించనున్నారని తెలుస్తోంది. ఈ పర్యటనతో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను బలపర్చుకోవటమే ప్రధాన లక్ష్యమని అంటున్నారు. అంతేకాక భారత్ లోకి అక్రమ వలసలు తదితర అంశాలను చర్చల్లో సుష్మ వెంట వెళ్లే భారత ప్రతినిధి బృందం లేవనెత్తవచ్చని తెలుస్తోంది. ఏదేమైనా భవిష్యత్తులో బంగ్లాతో సంబంధాలకు ఈ పర్యటన బాగా ఉపయోగ పడుతుందని కేంద్రం ఆశిస్తోంది.

  • Loading...

More Telugu News