: ఏపీ, తెలంగాణలో మరో రెండు రోజుల పాటు వడగాలులు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో రాగల 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు, అటు తెలంగాణలో ఖమ్మం, మెదక్, నల్గొండ జిల్లాల్లో వడగాలులు వీసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో గత రెండు రోజులుగా పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని అధికారులు చెప్పారు.