: తలలపై వెలలు ప్రకటించారు!
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నేడు పలువురి తలలపై రివార్డులు ప్రకటించింది. వారిలో మావోయిస్టులతోపాటు కొందరు టెర్రరిస్టులు కూడా ఉన్నారు. మావోయిస్టు అగ్రనేత గణపతిపై అత్యధికంగా రూ. 15 లక్షల రివార్డు ప్రకటించారు. ఇక ఇతర మావోయిస్టు నేతలు నంబాల కేశవరావు, తిరుపతి అలియాస్ దేవూజీ, నారాయణరావులపై రూ. 10 లక్షల రివార్డు ప్రకటించారు. మరోవైపు హైదరాబాద్ బాంబు పేలుళ్ళ కేసులో నిందితులని భావిస్తున్న యాసిన్ భత్కల్, రియాజ్ భత్కల్ సోదరులతో సహా 15 మంది ఇండియన్ ముజాహిదిన్ తీవ్రవాదులపై రూ. 10 లక్షల రివార్డు ప్రకటించారు. వీరి ఆచూకీ గురించి సమాచారం అందించిన వారికి ఈ నగదు పారితోషికం అందిస్తారు. వెల్లడించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు.