: మరో సంచలన వ్యాఖ్య చేసిన శంకరాచార్య
ద్వారకాపీఠ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సాయిబాబాను ఆరాధించేవారు శ్రీరాముడిని పూజించడం ఆపేయాలని అన్నారు. అంతేగాకుండా, వారు గంగానదిలో మునగరాదని, హరహర మహాదేవ నినాదం చేయరాదని డిమాండ్ చేశారు. ఇంతకుముందు సాయిబాబా దేవుడు కాదని, ఆయనను పూజించరాదని శంకరాచార్య చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపడం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయనపై షిరిడిలో కేసు కూడా నమోదైంది.