: పట్టాలు తప్పిన రాజధాని... ఐదుగురి మృతి
ఈ తెల్లవారుజామున ఢిల్లీ-డిబ్రూగఢ్ రాజధాని ఎక్స్ ప్రెస్ బీహార్ లోని చాప్రా వద్ద పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించగా, ఎనిమిది మంది గాయపడ్డారు. 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనాస్థలి వద్ద ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రయాణికులను రిలీఫ్ ట్రైన్ లో సమీప స్టేషన్ కు తరలించారు. ఈ ఘటన పట్ల రైల్వే మంత్రి సదానంద గౌడ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. వారికి రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడినవారికి లక్ష రూపాయలు అందించాలని నిర్ణయించారు.