: హైకోర్టు నిబంధనలకు లోబడే కూల్చివేత: జీహెచ్ఎంసీ
హైదరాబాదు మాదాపూర్ లోని అయ్యప్ప సొసైటీలో అక్రమ నిర్మాణాల కూల్చివేత రెండో రోజూ కొనసాగుతోంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ మహేందర్ మీడియాతో మాట్లాడారు. కూల్చివేత ప్రక్రియ హైకోర్టు నిబంధనలకు లోబడే కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. నిన్న 16 భవనాలను కూల్చివేశామని, నేడు మరో 10 కట్టడాలను కూల్చివేస్తామని తెలిపారు.