: ప్రీతి జింతా వాంగ్మూలం ఇచ్చింది
బాలీవుడ్ నటి ప్రీతి జింతా ఇవాళ సాయంత్రం ముంబైలోని వాంఖడే స్టేడియానికి వచ్చి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. మే 30న ఇదే స్టేడియంలో నెస్ వాడియా తనను వేధించాడంటూ గతవారం ప్రీతి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఫిర్యాదు ఇచ్చిన తర్వాత విదేశాలకు వెళ్లిపోయిన ఆమె ఆదివారం నాడు భారత్ కు తిరిగి వచ్చింది. ఈరోజు సాయంత్రం పోలీసులు స్టేడియంలో ప్రీతి వాంగ్మూలాన్ని నమోదు చేశారు.