: ఆ దంపతులు జీవితంలోనే కాదు... మరణంలోనూ కలిసే ఉన్నారు!
రాజస్థాన్ లోని ఆ దంపతులు జీవితంలోనే కాదు.. మరణంలోనూ విడిపోలేదు. గుండెపోటుతో భార్య మరణించగా, ఆమె మరణవార్త విని షాక్ తో భర్త కన్నుమూశాడు. రాజస్థాన్ లోని చురు జిల్లాకు చెందిన ప్రేమలత, శాంతిలాల్ జైన్ మరికొందరు బంధువులతో కలిసి విమానంలో ఢిల్లీ నుంచి గౌహతి వెళ్తున్నారు. విమానం బయల్దేరిన కొద్దిసేపటికే ప్రేమలతకు గుండెనొప్పి వచ్చింది. దాంతో పైలట్ విమానాన్ని వెనక్కి మళ్లించి ఢిల్లీలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. హుటాహుటిన ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆమె మరణించినట్లు డాక్టర్లు చెప్పారు. ఆ మాట వింటూనే శాంతిలాల్ జైన్ ఆసుపత్రిలో కుప్పకూలి తుదిశ్వాస విడిచారు.