: కృష్ణా డెల్టాకు నీరు విడుదల చేయాలని ఆదేశం


కేంద్ర జల సంఘం ఆదేశాల మేరకు కృష్ణా డెల్టాకు నాలుగు టీఎంసీల నీరు విడుదల చేయాలని కృష్ణా బోర్డు తాజాగా ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు డెల్టాకు రోజుకు ఆరువేల క్యూసెక్కుల నీరు చొప్పున వారం పాటు నీటి విడుదలకు ఆదేశాలిచ్చినట్టు మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు హైదరాబాదులో రెండు రాష్ట్రాల సీఎస్ లతో కేంద్ర జలసంఘం ఛైర్మన్ సమావేశం జరిపారు. ఇందులోని నీరు విడుదల చేయాలని తెలిపినట్టు మంత్రి చెప్పారు. కాగా, ఈ నీరు తాగడానికే వాడాలని ఏపీ సీఎఎస్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. ఇక ఖమ్మం, నల్లొండ జిల్లాలు, హైదరాబాదు కు కూడా తాగునీరు విడుదల చేయాలని బోర్డు ఆదేశించింది.

  • Loading...

More Telugu News