: చానళ్ళ యాజమాన్యాలు రెచ్చగొడుతున్నాయి:టీవీ నటులు
తెలుగు టీవీ ఆర్టిస్టుల ఉపాధికి డబ్బింగ్ సీరియళ్ళు గండికొడుతున్నాయంటూ ఉద్యమబాట పట్టిన తెలుగు టీవీ పరిరక్షణ సమితి రేపు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమైంది. కొన్ని చానళ్ళలో ఇంకా పరభాషా ధారావాహికలు ప్రసారం అవుతూనే ఉన్నాయని, వాటిని ఆపకపోతే ఉగాది నాడు ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా నిర్వహిస్తామని సమితి తెలిపింది. డబ్బింగ్ సీరియళ్ళు ప్రసారం చేసి తమ పొట్ట కొట్టొద్దని వేడుకుంటున్నా, పలు చానళ్ళ యాజమాన్యాలు రెచ్చగొట్టే ధోరణి కనబరుస్తున్నాయని తెలుగు టీవీ పరిరక్షణ సమితి ప్రతినిధులు వాపోయారు. డబ్బింగ్ సీరియళ్ళ కారణంగా తెలుగు సంస్కృతి నాశనం అవుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రేపు నిర్వహించే ధర్నా కార్యక్రమాలకు సినీ నటులు రాజశేఖర్, జీవిత తదితరులు హాజరవుతారని వారు చెప్పారు.