: వరంగల్ లో పీవీ విగ్రహం ఏర్పాటు
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతిని రాష్ట్ర ఉత్సవంగా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పీవీ జయంతి నేపథ్యంలో సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి ఇవాళ సమీక్ష నిర్వహించారు. జయంతి ఏర్పాట్ల గురించి ప్రధానంగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా హన్మకొండలో పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు టీఆర్ఎస్ నేత కెప్టెన్ లక్ష్మీకాంతరావు తెలిపారు.