: ఉత్తర కేరళలో దావూద్ అనుచరుడు అబ్దుల్ హమీద్ అరెస్టు


ఉత్తర కేరళలోని కాసర్ గడ్ లో ఓ వ్యాపార వేత్త ఇంటిపై కాల్పుల కేసులో అనూహ్యంగా అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అనుచరుడు అబ్దుల్ హమీద్ ను పోలీసులు అరెస్టు చేశారు. 2010, 2013లో సదరు వ్యాపార వేత్త ఇంటిపై రెండుసార్లు కాల్పులు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి కుట్ర పన్నినట్లు అబ్దుల్ పై ఆరోపణలు రావడంతో మూడు రోజుల కిందట అదుపులోకి తీసుకున్నారు. కాగా, అతనిపై ఇప్పటికే పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News