: కాంగ్రెస్ కు సొంత మీడియా కావాలి: డిగ్గీతో మొరపెట్టుకున్న రాష్ట్ర నేతలు


ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీలో ఇంకా పోస్టుమార్టం ప్రక్రియ కొనసాగుతూనే ఉంది! తాజాగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ తో ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, చిరంజీవి, పళ్ళంరాజు, జేడీ శీలం తదితరులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఆయనకు పలు అంశాలు నివేదించారు. రాష్ట్రంలో ప్రధాన పార్టీలకు సొంత మీడియా ఉందని, కాంగ్రెస్ కు కూడా సొంత పత్రిక, చానల్ అవసరమని వారు వివరించారు. రాష్ట్ర విభజన పాపం ఒక్క కాంగ్రెస్ పార్టీదేనని మీడియాలో పదేపదే ప్రచారం కావడం దెబ్బతీసిందని, సొంత మీడియా ఉంటే ఈ పరిస్థితి ఉండేదికాదని నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News