: మరోసారి ఎయిర్ ఏషియా ఇండియా బంపరాఫర్


చవక ధరలకే విమానయానం అంటూ కేవలం 339 రూపాయల ఛార్జీకే బెంగళూరు-చెన్నై మధ్య విమానం నడిపి ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ మరోసారి ప్రమోషనల్ ఆఫర్ అంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ లో భాగంగా బెంగళూరు-కొచ్చి, బెంగళూరు-చెన్నై నగరాల మధ్య 1490 రూపాయలు, బెంగళూరు-గోవా మధ్య 1690 రూపాయలతో విమాన ప్రయాణం చేయవచ్చని తెలిపింది. అయితే ఈ ఆఫర్ ఈ నెల 29 లోపు బుక్ చేసుకున్నవారికేనని స్పష్టం చేసింది. జూలై 1 నుంచి అక్టోబర్ 25వ తేదీ మధ్య చేసే ప్రయాణాలకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఆ సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News