: మోడీ సమర్థుడనేది మీడియా సృష్టే: సీపీఐ నారాయణ
ప్రధాని నరేంద్ర మోడీపై సీపీఐ నేత నారాయణ విమర్శలు గుప్పించారు. దేశమంతా మోడీనే అత్యంత సమర్థుడని కితాబిస్తోందని, అయితే ఇదంతా నిజం కాదని... అంతా మీడియా సృష్టే అని అన్నారు. కాంగ్రెస్ వైఫల్యాలు మోడీకి బాగా కలసివచ్చాయని... అందుకే బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగిందని తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని చర్చించుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని... అయితే, చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ రాజకీయాలు చేస్తూ ఇరు ప్రాంతాల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. ఈ రోజు ఆయన చిత్తూరు జిల్లా మదనపల్లెలో మీడియాతో మాట్లాడారు.