: విశాఖను ఆర్థిక రాజధాని చేస్తానంటున్న గంటా
విశాఖ నగరాన్ని ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దుతానని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. అటు విశాఖలో కొత్తగా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని కూడా చెప్పారు. దానికోసం స్థల సేకరణ చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు వివరించారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడిన ఆయన, ఇక్కడ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఇప్పటికే టెండర్లు కూడా పిలిచినట్లు వెల్లడించారు. సినీ పరిశ్రమ అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.