: ట్రెండు మార్చిన టీమిండియా
టీమిండియా ఆటగాళ్ళ విజ్ఞప్తికి బీసీసీఐ ఓకే చెప్పింది. తత్ఫలితంగా భారత క్రికెటర్లు విదేశాలకు ప్రయాణించేటప్పుడు క్యాజువల్ వేర్స్ ధరించే వెసులుబాటు కలిగింది. ఇప్పటి వరకు విదేశీ టూర్లకు మనవాళ్ళు అధికారిక బ్లేజర్లు ధరించి విమానప్రయాణాలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. టీషర్టులు, లేక ఇతర క్యాజువల్స్ వేసుకునే సౌలభ్యం కల్పిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా, తాము విదేశాలకు వెళ్ళేటప్పుడు సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి ఉంటుందని, ఎకానమీ క్లాస్ లో కూర్చుని అంతసేపు ప్రయాణం చేయడం కష్టంతో కూడుకున్నదని టీమిండియా క్రికెటర్లు బోర్డుకు తెలిపారు. దీనిపైనా బీసీసీఐ సానుకూలంగానే స్పందించింది. ఇకపై బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేసేలా నిబంధనావళి సవరించింది.