: బాబు ప్రసంగం పరనింద, ఆత్మస్తుతిలా ఉంది: రోజా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడిన తీరు పరనింద, ఆత్మస్తుతిలా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. టీడీపీ శిక్షణా శిబిరాల్లో చెప్పే మాటలనే ఆయన సభలో చెప్పారని ఆమె అన్నారు. 9 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు రైతు రుణమాఫీపై కమిటీ వేయడం ఏమిటని రోజా ప్రశ్నించారు. ఎన్టీఆర్ పార్టీని సొంతం చేసుకోవడం కాదు... ఆయన ఆశయాలను బాబు నెరవేర్చాలని రోజా అన్నారు.