: 'నటకిరీటి'కి 'హాస్యకిరీటి' బిరుదు


ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ ను కెనడాలోని ప్రవాసాంధ్రులు 'హాస్య కిరీటి' బిరుదుతో ఘనంగా సత్కరించారు. తాజాగా ఆయన నటించిన 'డ్రీం' చిత్రంలో నటనకుగానూ వాంకోవర్ లో జరిగిన కెనడా అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో రాజేంద్రప్రసాద్ 'రాయల్ రీల్' అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను ప్రవాసాంధ్రులు విశేషంగా సత్కరించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే అవార్డు లభించిందన్నారు. వారి ఆదరణతో మరిన్ని విజయాలు సాధిస్తానన్న నమ్మకం తనకు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 'డ్రీం' చిత్ర దర్శకుడు భవానీ శంకర్ కూడా పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News