: ఏపీ శాసనసభ తొలి సమావేశాల విశేషాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తొలి సమావేశాలు ముగిశాయి. మొత్తం ఐదు రోజుల పాటు సమావేశాలు కొనసాగాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై సభలో చర్చ జరిగింది. మొత్తం 52 మంది సభ్యులు చర్చలో పాల్గొన్నారు. 19 గంటల 20 నిమిషాల పాటు చర్చ కొనసాగింది. పలు తీర్మానాలకు సభ ఆమోదం లభించింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచే బిల్లును సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.