: కాంగ్రెస్ నేత మిశ్రాపై మధ్యప్రదేశ్ సీఎం పరువు నష్టం కేసు
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి కెకె మిశ్రాపై పరువు నష్టం దావా కేసు నమోదు చేశారు. ప్రీ మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ స్కామ్ (పీఎంటీ) లో చౌహాన్ భార్య పాత్ర ఉందంటూ మిశ్రా ఆరోపణలు చేయడంతో ఈ కేసు వేశారు. అయితే, ఆ స్కాం వల్ల తన కుటుంబ సభ్యులెవరైనా బెనిఫిట్ పొందినట్టైతే... దానికి సంబంధించిన ఆధారాలను చూపించాలని సవాల్ విసిరారు. అటు దీనిపై స్పందించిన మిశ్రా, తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, వారు నిరూపించుకోవాలని అన్నారు.