: గుజరాత్ పోలీస్ ఫోర్స్ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్
గుజరాత్ పోలీస్ ఫోర్స్ లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనంది పటేల్ వెల్లడించారు. సమాజంలో మహిళా సాధికారతకు రిజర్వేషన్లు అవసరమని ఆమె చెప్పారు. ఈ మేరకు తమ ప్రభుత్వం పోలీస్ రిక్రూట్ మెంట్ లో ముప్పైమూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు. 97వ ఆర్మ్ డ్ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్స్ పాసింగ్ పెరేడ్ లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆమె, పై విషయాన్ని ప్రకటించారు.