: కసితో, పట్టుదలతో పని చేసి... స్వర్ణాంధ్రప్రదేశ్ ను తయారు చేస్తా: బాబు


సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరినీ ఏకతాటిపై చూడాలన్నది తన జీవితాశయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. హైదరాబాదులోని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తానని అన్నారు. అన్ని రంగాలకు రుణాలు ఇస్తామనీ, అన్ని రంగాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. కసితో, పట్టుదలతో పని చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేరుస్తానని ఆయన చెప్పారు. విద్వేషాలు రెచ్చగొడుతున్న ప్రతివారు అవాక్కయ్యేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతానని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానని ఆయన వెల్లడించారు.

కాపులను బీసీల్లో చేర్చి రిజర్వేన్లు కల్పిస్తామని ఆయన తెలిపారు. బ్రహ్మాండమైన పోర్టులు, వనరులు ఉన్నాయని ప్రతిదానిని వినియోగించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తన వద్ద ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ఓ ఊహా చిత్రం ఉందని... దానిని నిజం చేసి చూపిస్తానని బాబు తెలిపారు.

  • Loading...

More Telugu News