: స్టేడియంలో.. కాదు ఇంట్లోనే
మాజీ ప్రియుడు నెస్ వాడియాపై నటి ప్రీతిజింటా పెట్టిన వేధింపుల కేసులో విచారణకు గాను ఆమెను వాంఖడే స్టేడియానికి రావాలని పోలీసులు కోరినట్లు సమాచారం. మే 30న ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా స్డేడియంలో నెస్ వాడియా తనను వేధించడంతోపాటు దాడి చేసినట్లు ప్రీతిజింటా కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఘటన జరిగిందని ప్రీతిజింటా చెబుతున్న ప్రదేశంలోనే ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. అయితే, ప్రీతిజింటా మాత్రం బాంద్రాలోని తన నివాసంలోనే స్టేట్ మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు సమాచారం.