: టీవీ9, ఏబీఎన్ ప్రసారాల నిలిపివేతపై కిషన్ రెడ్డి లేఖ
కొన్ని రోజులుగా తెలంగాణలో టీవీ9, ఏబీఎన్ ఛానళ్ల ప్రసారాల నిలిపివేతపై జోక్యం చేసుకోవాలని కోరుతూ గవర్నర్ నరసింహన్ కు టీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి లేఖ రాశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తులను ప్రోత్సహించడాన్ని ఆపాలని... పత్రిక, ప్రసార సాధనాల స్వతంత్రతను కాపాడాలని కోరారు.