: శంకరాచార్యపై సాయిబాబా భక్తుల ఆగ్రహం
షిరిడీ సాయిబాబా దేవుడు కాదని, అసలు పూజించడం తప్పంటూ ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య స్వామి స్వరూపానంద నిన్న (సోమవారం) చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో సాయిబాబా భక్తులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు వారణాసిలో శంకరాచార్య దిష్టిబొమ్మను భక్తులు దగ్ధం చేశారు. దీనిపై ఆ వెంటనే స్పందించిన స్వరూపానంద, తానెలాంటి ప్రకటనలు కానీ, ఉద్రిక్తత రేపే వ్యాఖ్యలు గానీ చేయలేదన్నారు.