: ధోనీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన అనంతపురం కోర్టు


టీమిండియా కెప్టెన్ ధోనీని వెంటనే అరెస్ట్ చేయాలంటూ అనంతపురం కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. హిందూ దేవతలను అవమానపరిచేలా ధోనీ వ్యవహరించాడని వీహెచ్ పీ జిల్లా ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్ ఫిబ్రవరిలో పిటిషన్ దాఖలు చేశారు. బిజినెస్ టుడే ముఖచిత్రంపై విష్ణుమూర్తి అవతారంలో ఉన్న ధోనీ చిత్రాన్ని ముద్రించి... అతని చేతిలో బూటు ఉంచారని ఫిర్యాదులో తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలను కించపరిచేలా ధోనీ వ్యవహరించాడని పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన కోర్టు ధోనీకి ఇప్పటి వరకు మూడు సార్లు సమన్లు జారీ చేసింది. అయినా ధోనీ ఇంతవరకు కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం ఈ రోజు ధోనీకి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.

  • Loading...

More Telugu News