: పెంచిన రైల్వే ఛార్జీలు క్యాన్సిల్ చేయండి... కేంద్రానికి సొంత ఎంపీల విజ్ఞప్తి


నాలుగు రోజుల కిందట ఎన్డీఏ ప్రభుత్వం గణనీయంగా పెంచిన రైల్వే ఛార్జీలను వెనక్కి తీసుకోవాలని సొంత ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మహారాష్ట్రకు చెందిన బీజేపీ, శివసేన ఎంపీలు, శాసనసభ్యులు ఈ రోజు ఉదయం రైల్వే శాఖ మంత్రి సదానందగౌడను కలిశారు. అక్టోబర్ లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఛార్జీలను రద్దు చేయాలని కోరారు. పెంచిన ఛార్జీలతో ముంబైలో రోజూ మెట్రో, లోకల్ రైళ్లలో ప్రయాణించే లక్షల మంది ప్రయాణికులపై భారం పడుతుందని మంత్రికి వివరించారు. అయితే, ఛార్జీల పెంపు విషయంలో ముంబైకర్ల బాధను తాము అర్థం చేసుకుని, పరిగణిస్తామని సదానందగౌడ హామీ ఇచ్చారని అనంతరం బీజేపీ నేత కిరీట్ సోమయా తెలిపారు.

  • Loading...

More Telugu News