: వ్యాంపు క్యారెక్టర్ నటి వ్యాంపు భాగోతం
వ్యాంపు క్యారెక్టర్లలో రాణించి అవకాశాలు రాక నిజజీవితంలో వ్యాంపైపోయిందో సినీ తార. కన్నడ సినిమాల్లో శృంగార తారగా పేరొందిన నయన కృష్ణకు అవకాశాలు అడుగంటిపోయాయి. దీంతో ఆమె మరో రకమైన సంపాదనలో పడింది. తనకున్న ఇమేజ్ తో ప్రముఖ వ్యక్తులకు వలవేసి, వారితో సన్నిహితంగా మెలిగి, దానిని వీడియో తీయించి, అది వారికి చూపించి బ్లాక్ మెయిల్ చేస్తోంది. బెంగళూరులో నయన కృష్ణ హొయలకు ఓ డాక్టర్ పడిపోయాడు.
అతనితో సన్నిహితంగా మెలిగిన నయన కృష్ణ, వీడియో క్లిప్పింగులు చూపించి కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. వీడియో చూసి అవాక్కయిన డాక్టర్ కు, ఆమె డిమాండ్ చేసిన మొత్తం విని దిమ్మతిరిగింది. దీంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. వారి సూచనల మేరకు ముందుగా లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇస్తానని చెప్పారు.
ఆ డబ్బు వసూలు చేసుకునేందుకు వచ్చిన ఆమె ముగ్గురు అనుచరులను పోలీసులు అరెస్టు చేయగా, ఒకడు తప్పించుకుని పారిపోయాడు. అతనితో పాటు నయన కృష్ణ కోసం కన్నడ పోలీసులు గాలింపు చేపట్టారు. ఆమె చెన్నైలో ఉందన్న సమాచారంతో బెంగళూరు పోలీసులు చెన్నై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో విషయం వెలుగు చూసింది.