: తండ్రి స్థానికతను అడగడం చరిత్రలో ఎక్కడా లేదు... టి.ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టిన యనమల


విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ రెండు రాష్ట్రాల మధ్య దుమారాన్ని రేపే పరిస్థితి కనిపిస్తోంది. విద్యార్థి మాత్రమే తెలంగాణలో పుడితే సరిపోదని... విద్యార్థి తండ్రి కూడా తెలంగాణలో పుడితేనే ఫీజు రీయింబర్స్ మెంట్ వర్తింపజేయాలన్న టి.ప్రభుత్వ వైఖరిని ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు తప్పుబట్టారు. తండ్రి స్థానికతను అడగడం చరిత్రలో ఎక్కడా లేదని ఎద్దేవా చేశారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని నీరుగార్చేందుకే తెలంగాణ ప్రభుత్వం తండ్రి స్థానికతను అడుగుతోందని ఆరోపించారు.

  • Loading...

More Telugu News